తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు ఐఏఎస్ అధికారిని సత్య శారదా దేవిని నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015 క్యాడర్‌కు చెందిన సత్య శారదాదేవి త్వరలో వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ప్రావీణ్య హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు.
previous post