(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ): ఆత్మకూరు మండలం అన్ని గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా సంప్రదాయ బద్దకంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధరించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గొర్రెలను మేకలను కోసి కుర్బానీ ని పేద ప్రజలకు అందజేసారు. త్యాగానికి ప్రతిగా బక్రీద్ పండుగను నిర్వహించడం జరుగుతుందని మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి బాబు మీ యా ( చిరు) అన్నారు ఆయన గూడెప్పాడ్ మసీదులో ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే హౌస్ బుజ్జూర్గు, ఆత్మకూరు తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపు ఉన్నారు.
next post