జై భారత్ వాయిస్ హనుమకొండ :వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచన మేరకు డాన్ టు డస్ క్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఎక్సైజ్ కాలనీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో భాగంగా గో సేవ, వీధి వ్యాపారులకు గొడుగులు, తిరిగి అమ్మే వీధి వ్యాపారికి నాలుగు చక్రాల తోపుడు బండి, పిల్లలకు నోటుబుక్కులు, పెన్నులు ,ట్రాఫిక్ పోలీసులకు సన్మానం, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనుమల్లపూడి హరి ప్రసాద్, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తాళ్లపల్లి వాసుదేవులు, జిల్లా గవర్నర్ గంప సాంబమూర్తి ,రీజియన్ చైర్మన్ చిదురాల నాగరాజు, ఎక్సైజ్ కాలనీ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ దొడ్డ లావణ్య, కార్యదర్శి జగదీశ్వరి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
next post