Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పాఠశాలలను తనీఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య

జై భారత్ వాయిస్ హన్మకొండ
ప్రభుత్వ పాఠశాలలో వివిధ వసతులు త్రాగునీరు, విద్యుత్తు, టాయిలెట్స్ మరియు ఇతర పనులు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి చేసిన పనులకు వెంటనే చెల్లింపులు కొరకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని హరిచంద్ర నాయక్ తండ అర్వపల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టి పూర్తి చేసిన పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించి చెల్లింపుల కొరకు బిల్లును సమర్పించాలని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ జరిగిందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు .హరిచంద్ర నాయక్ తండ అర్వపల్లి లోని ప్రాథమిక పాఠశాల ల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడి కేంద్రా లను సందర్శించి పిల్లలకు కల్పిస్తున్న ఆహారం మరియు ఇతర విషయాల గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అర్వపల్లి గ్రామపంచాయతీ నర్స రీని సందర్శించి అక్కడ పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేదవతి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్.అబ్దుల్ హై, ఎంపీడీవో ప్రవీణ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తాం సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ను కలిసిన దారం యువరాజ్

పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు