కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ నుండి జాతీయ రహదారికి వెళ్లే దారిలో కల్వర్టుపై గుంత ప్రమాదకరంగా ఏర్పడి గుంతలో పడితే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం కల్వర్టు మరమ్మత్తు పనులు చేపట్టకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్వర్టు మరమ్మత్తు పనులు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.