బోలా శంకరుడైన బలరామునికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఫౌండర్ రేవంత్ రాథోడ్..
వరంగల్ జిల్లా /జూన్ 30(జై భారత్ వాయిస్ న్యూస్): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి లంబాడి సామాజిక వర్గానికి చెందిన పోరిక బలరాం నాయక్ కే కేటాయించాలని
ఆర్.సి.సి ఫౌండర్ రేవంత్ రాథోడ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి డిమాండ్ చేశారు. ఆదివారం జై భారత్ వాయిస్ న్యూస్
రిపోర్టర్ తో రేవంత్ రాథోడ్ ఫోన్ ఇన్ ద్వారా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడీలు కీలక పాత్ర పోషించిన విషయం యావత్ రాష్ట్ర ప్రజలకి తెలిసిన విషయమే. కేవలం లంబాడీల ఓట్ల ద్వారానే ఓడిపోయామని సాక్షాత్తు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము నిర్వహించుకున్న సమీక్ష సమావేశంలో మీడియా ముందు మాట్లాడారు. కానీ నేటి వరకు కాంగ్రెస్ పార్టీ లంబాడీలకు మొదటి మంత్రి వర్గం సమావేశంలో మంత్రి పదవి ఇవ్వడంలో కొంత మేరకు విఫలం అయింది. ప్రస్తుతం జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని రేవంత్ రాథోడ్ డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి అనుభవం కలిగి కల్మషం లేని వ్యక్తి, పార్టీని నడపగలిగే సత్తా లంబాడీలలో కేవలం పొరిక బలరాం నాయక్ కే వుందని, కావున లంబాడి సామాజిక వర్గం నుండి బలరాం నాయక్ కి తప్పకుండా పిసిసి అధ్యక్ష పదవి కేటాయించాలని రేవంత్ రాథోడ్ అన్నారు.