( జై భారత్ వాయిస్ గీసుకొండ )
గీసుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉపకేంద్రం నంద నాయక్ తండా, మంగళ్ తండా లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన తెలిపారు ఈ క్యాంపు నిర్వహణ ఉప కేంద్రం డాక్టర్ సదానందం సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి,తగిన సలహాలు సూచనలు, మందులను ఉచితంగా ఇవ్వడమైనది. ఈ వైద్య శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న 8 మందికి రక్తనమోనాలు సేకరించి, మందులను ఇవ్వడం అయినది. ఈ వైద్య శిబిరంలో సూపర్వైజర్స్ కిరణ్ కుమార్,స్వరూప, ఏఎన్ఎంలు రత్నవల్లి, రమ, హెల్త్ అసిస్టెంట్ లచ్చయ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post