Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం

జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ నవరాత్ర మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 4-00 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట దీక్షా హోమం జరిపి చతుస్థానార్చన పూర్తి చేసిన అనంతరం తిథి మండల దేవతా యజనంలో భాగంగా అమ్మవారి షబ్బేరాలలో జ్ఞాన శక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి కపాలని మాతగాను క్రియాశక్తిని షోడశి క్రమాన్ని అనుసరించి భగమాలిని మాతగాను అలంకరించి పూజారాధనలు జరిపారు. కపాలిని మాత సృష్టిని అసూరి శక్తుల విధ్వంసం నుండి కాపాడుతుంది. పైశాచిక శక్తులను సంహరించి అసురీ శక్తులపై దేవి శక్తుల విజయసంకేతంగా రాక్షసుల కపాలాలను మాలగా ధరిస్తుంది. భగమాలిని మాతను బ్రాహ్మి శక్తి అని కూడా అంటారు. ఈ భగమాలిని మాతను ఉపాసించడం వల్ల సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి, అంతేగాక విదియ తిధికి అది దేవత అయిన బ్రహ్మ ఉపాసన కూడా జరుపబడింది. బ్రహ్మ యజనం కూడా జరిగింది.  ఆదివారం కూడా కావటంతో భక్తులు వేలాదిగా అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఉదయం సాయంత్రం పూజానంతరం ప్రసాద విత్తరణ చేశారు ఆలయాన్ని  ప్రముఖులలో అమ్మవారిని దర్శించుకున్న అడిషనల్  కలెక్టర్  సంధ్యారాణి దంపతులు‌ఎంజీఎం హాస్పిటల్ విశ్రాంత సూపర్నెంట్ ప్రఖ్యాత చర్మ వైద్యానికి డాక్టర్ రామచంద్ర ధరక్ తదితరులు ఉన్నారు

.

Related posts

సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’

Jaibharath News

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసిన పద్మశాలి కులస్థులు

Jaibharath News

వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో రెండు రోజులు నీటి సరఫరా బంద్.