Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో వైద్య శిబిరం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని ఉప కేంద్రాల గ్రామాలలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినదని మండల వైద్యాధికారి డాక్టర్ అర్చన తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో భాగంగా సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు  పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన గ్రామాల ప్రజలకు వివరించడం జరిగింది. ఈ వైద్య శిబిరము నందు జ్వరంతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్న  గ్రామాల ప్రజలకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో  అన్ని ఉప కేంద్రాల డాక్టర్లు,  సిహెచ్ఓ మధుసూదన్ రెడ్డి, సూపర్వైజర్లు కిరణ్ కుమార్, స్వరూప ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

Jaibharath News

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ