పెంచికలపేట లో ఘనంగా బీరన్న బోనాల పండుగ -హాజరైన కూడా చైర్మన్ వెంకట్రాం రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట గ్రామంలోని బీరన్న బోనాలు పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బీరన్న పండుగను ప్రత్యేకంగా కురమ కులస్తులు వైభవంగా జరుపుకున్నారు.ఇంటికో బోనం నెత్తిన ఎత్తుకొని పిల్లా పాపలతో కుటుంబ సభ్యుల సమేతంగా బీరన్న దేవాలయానికి డప్పు వాయిద్యాల మధ్య, విన్యాసాలతో చేరుకున్నారు. తొలుత అక్క మహంకాళి అమ్మవారి కి పూజలు చేశారు. కామరాతి సమేతుడైన బీరన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూప దీపాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. చివరిగా పోతు లింగన్న దేవునికి గొర్రెలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇన్గాల వెంకట్రామ్ రెడ్డి నెత్తిన బోనం ఎత్తుకున్నారు. భక్తులు అనందో త్సాహాల మధ్యన ఊరేగింపు నిర్వహించారు.కురుమ కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
previous post