April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

హెచ్ జీ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన కల్పించండి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ వరంగల్
స్వయం సహాయక మహిళా సభ్యులకు (ఎస్ హెచ్ జి) మహిళ శక్తి పథకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు.
బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో శుక్రవారం బ్యాంకర్లు మెప్మా అధికారులు సిబ్బంది తో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలానే లక్ష్యం తో స్వయం సహాయ మహిళ బృంద సభ్యులు బృందాల వారిగా వ్యక్తిగతంగా వివిధ రకాల ఉపాధి యూనిట్లను ఏర్పరచుకొని వ్యాపార వేత్తలు గా ఎదగడానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని ఫుడ్ ప్రాసెసింగ్ క్యాటరింగ్ క్యాంటీన్ లు ఈవెంట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తదితర 8 రంగాల్లో సభ్యులకు బ్యాంక్ ల ద్వారా కమ్యూనిటీ ఆర్గనైజర్ల సహకారం తో రుణాలు అందజేస్తారని బల్దియా వ్యాప్తం గా కనీసం 600 మంది సభ్యులకు వ్యక్తిగతం గా రుణాలు అందించాలని ఎస్ హెచ్ జీ మహిళా సంఘాల కు ఇట్టి పథకం పై అవగాహన కలిగించి వారిని ప్రోత్సహించి యూనిట్లు ఇప్పించే బాధ్యత మెప్మా అధికారులు సిబ్బంది తీసుకోవాలని ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక తయారు చేసి అమలు చేయాలనీ వారం లోగా లోన్ గ్రౌండ్ అయ్యేలా చూడాలని బ్యాంకర్ లకు సూచించారు.తొలి దశ లో భాగం గా బ్యాంకర్ లు రూ.32 కోట్లు ఋణం అందజేస్తారని ఈ సందర్భం గా కమీషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ కృష్ణ రావు సెక్రెటరీ విజయలక్ష్మి టిపిఆర్ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్ ఎల్ డి ఎం రాజు శ్రీ నిధి రీజనల్ మేనేజర్ అశోక్ టిఎంసి రమేష్ బ్యాంకు మేనేజర్ లు సి ఓ లు తదితరులు పాల్గొన్నారు

Related posts

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

Jaibharath News

జూట్ ఉత్పత్తులపై అవగాహన

బిజెపి ప్రచార రథాలను ప్రారంభించిన బిజెపి నాయకులు