షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, షీరిడి సాయిబాబా ప్రతిమను పల్లకిలో పెట్టి గ్రామ వీధులలో వాడవాడలలో ఊరేగింపు చేశారు. అనంతరం షిరిడి సాయిబాబా మందిరంలో భక్తుల విరాళాలతో మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఆలయంలో బాబాకు అభిషేకాలు చేసి, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా కృపాకటాక్షాలు ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ కోమండ్ల చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి బూర సతీష్, సభ్యులు జిన్న రామకృష్ణారెడ్డి, రేవూరి సంపత్ రెడ్డి,గట్టు రఘు, మహేందర్ రెడ్డి, మహేందర్,భక్తులు పాల్గొన్నారు.
previous post