జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలంలో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియను ఎడిఎ గౌస్ హైదర్ ప్రక్రియను పరిశీలించారు రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆయన వివిధ రుణమాఫీ సమస్యలతో వచ్చిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక లక్షవరకు మొదటి విడుత రుణమాఫీ డబ్బలు రైతుల ఖాతాల్లో జమఔతున్నాయని, ఏదైనా సాంకేతక కారణాల వల్ల ఆ లిస్టులో పేరు రాని వారు మండల వ్యవసాయ అధికారిని గాని, క్లస్టర్ ఎఈఓ. లను గాని సంప్రదిస్తే తగు సమాధానం ఇవ్వడమేకాకుండా -జిల్లా అధికారులకు ఆ సమస్యలను పంపించి పరిష్కరిస్తారని తెలిపారు. రైతులు ఎవ్వరు అనవసరమైన ఆందళన చెందవలసిన అవసరం లేదని వ్యవసాయ అధికార్డు ఆ విషయాలను చూసుకుంటాగారన్నారు.అనంతరం , గీసుగొండ యూనియన్ బ్యాంక్ శాఖను సందర్శించి బ్యాంక్ మేనేజర్ విజయ్ తో రుణ మాఫీ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకున్నారు. రైతులుకు ఏమైన సమస్యలుంటే వ్యవసాయ అంధికాల్లో దృష్టికి తీసుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ర్యాక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు, ఎఈఓ లు కావ్య, రజని, విజయ్, అబిద్ హుస్సేన్, అఖిల , రైతులు పాల్గొన్నారు.