Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూత

జై భారత్ వాయిస్ గీసుకొండ                  ‌
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, బచ్చోడు గ్రామానికి చెందిన కొమర సాత్విక అనే నిరుపేద అనాధవిద్యార్థిని హైదరాబాద్ లోని వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతోంది.  దురదృష్టవశాత్తు ఆమె తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో ఎవరూ లేని ఆమెకి కాలేజీ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లించడానికి ఆర్ధికఇబ్బందులు పడుతోంది. ఆ విద్యార్థిని దయనీయస్థితిని, గీసుకొండ గ్రామానికి చెందిన సదరు విద్యార్థిని పెద్దమ్మ  కత్తి హేమలత, ఎన్నో సేవా కార్యక్రమాలతో, దానధర్మాలతో  మానవత్వావాది నిరుపేదలకు అండగా  నిలుస్తున్న గీసుకొండ గ్రామానికి పెగళ్ళపాటి లక్ష్మినారాయణకు , ఆ అనాధ విద్యార్థినికి తగిన చేయూతనివ్వాలని అభ్యర్థించగా,  పెగళ్ళపాటి గీత – లక్ష్మినారాయణ దంపతులు వెనువెంటనే స్పందించి ఆ విద్యార్థినికి ఒక సంవత్సరం హాస్టల్ ఫీజు చెల్లించడానికై 50,000వేల రూపాయలు ఆర్థికసహాయాన్ని అందజేశారు.గీత – లక్ష్మినారాయణ దంపతులకు గీసుకొండ గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు

Related posts

అనంతారం బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు దూడే దిలీప్, బీఆర్‌ఎస్‌లో చేరిక

శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి పనులు పరకాల ఎమ్మేల్యే ప్రకాష్ రెడ్డి సందర్శించారు,

ఎలుగూర్ రంగంపేట  చెరువులో వింత చేప