జై భారత్ వాయిస్ వరంగల్
ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి,వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్ల పై వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో వరంగల్ ట్రై సిటి ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయిన ఈ సదస్సులో ముందుగా ఆటో డ్రైవర్లు ఎవిధంగా రోడ్లపై ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, ఎలాంటి నిబంధనలను పాటించాల్సి వుంటుదనే దానిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు, ఆర్.టి.ఓ అధికారులకు సూచించారు. అలాగే ఈ సదస్సు ఆటో డ్రైవర్లు ఎదుర్కోంటున్న సమస్యలను కూడా పలువురు ఆటో డ్రైవర్లు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకవచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఖాకీ యూనిఫారం ధరించే పోలీస్, ఆటోడ్రైవర్లు ఇరువురు ప్రజలకు సేవలందించేవారమని, ప్రధానంగా నగరంలో ఎంతో మంది డ్రైవర్లు లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతున్నారు. వీరికి ప్రమాదవశాత్తు ఎదైన జరిగితే భీమా నుండి ఎలాంటి లబ్ది రాదని, లైసెన్స్ లేని డ్రైవర్లకు ట్రాఫిక్ ఆర్.టి.ఒ అధికారులతో సమన్వయంతో లైసెన్స్‌లు అందించేందుకు పూర్తిగా కృషి చేస్తామని, నగరంలో తిరిగే ఆటోల సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ట్రాఫిక్ స్టేషన్లలో వుండే విధంగా ఆటో డ్రైవర్ల యూనియన్ జాగ్రత్త పడాలని, ఆటో డ్రైవర్ల క్షేమంగా కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని. ప్రధానంగా ఆర్థరాత్రి వేళకూడా ట్రై సిటికి వచ్చిన ఇతర ప్రదేశాల నుండి వచ్చే ప్రజలను ఆటో డ్రైవర్లను వారిని క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ఆటోలను నడపాల్సి వుంటుందని. ఆలాగే రోడ్లపై ఇతర వాహనదారులకు ఇబ్బంది పెట్టేవిధంగా రోడ్లపై ఆటోలను నిలపవద్దని,ఆటో వెనుక భాగంలో ఎలాంటి ప్రచార పోస్టర్లు లేకుండా చూడాలని, సౌండ్ బాక్స్‌లు, సెల్‌ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, మీరు చేసే చిన్న పోరపాట్ల వల్ల ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం పోంచి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ సదస్సులో తమ ఆటో ప్రయాణికులు మరిచిపోయిన ఖరీదైన వస్తువులని తిరిగి అందజేసిన ఆటో డ్రైవర్లను పోలీస్ కమిషనర్ సత్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ జాగృతి కళాబృందం సభ్యుల బృందగానం ఆటో డ్రైవర్లను ఆలోచింపజేసినవిగా వున్నాయి. ఈ కార్యక్రమములో ట్రాఫిక్ ఎసిపి సత్యనారయణ, వరంగల్ ఏసిపి నందిరాంనాయక్, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు రామకృష్ణ ,షూకూర్, నాగబాబు, ఆర్.టి.ఓ అధికారులు రామేష్ రాథోడ్, జైపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్.ఐలు విజయ్, రామారావు,ఉమాకాంత్‌తో పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గోన్నారు.
previous post
next post