జై భారత్ వాయిస్ హన్మకొండ తెలంగాణ రాష్ట్రం 1 లక్ష నుండి 1.50 లక్షల రుణ మాఫీ రెండవ విడుత కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి .రేవంత్ రెడ్డి అందరి శాసనసభ్యులతో కలిసి అసెంబ్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకున్నా మని అన్నారు, భారత దేశ రాజకీయ చరిత్ర లో ఇది ఒక చారిత్రక ఘట్టం , ఇప్పటికే 1లక్ష రూపాయల రుణం ఉన్న వారికి మాఫీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రైతాంగానికి పంట భీమా, రైతు భరోసా సరైన పద్ధతిలో అందేల రూపకల్పన తయారు చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో రైతే రాజు అనేలా తెలంగాణ రైతాంగం గర్వంగా చెప్పుకుంటారని ఆయన అన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి గ్యారెంటీ లను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు, ఇప్పటికే జూలై 18 తారీఖు నాడు 1లక్ష లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో , ప్రజా పాలనలో మాకు ప్రతి రోజు సవాల్ అని అన్నారు ప్రతి సవాల్ ని ఏదురుకొనే ప్రజా ప్రభుత్వాన్ని సరైన పద్ధతిలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు నిజం చెయ్యడం వాటినీ నిలబెట్టుకోడవం, రాష్ట్ర రైతాంగమేదనని మొత్తం తమ తమ ఇండ్లల్లో రుణ మాఫీ పండుగ సంబరాలు జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణం అని అన్నారు. రైతు తమ పంటలకై తెచ్చుకున్న పంట రుణాన్ని సకాలం సరైన పంటలు పండక అదే రైతు ఆత్మహత్యకి పాల్పడుతున్న సందర్బాలలో వచ్చిన ఆలోచేనే ఈ “రైతు రుణ మాఫీ” ఆనాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ లో రైతులకు ఇచ్చిన మాట మేం మర్వలేదని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ మొదటి విడుతా లో 25 వేల మంది రైతులకు 142కోట్ల మొత్తం రుణ మాఫీ జరిగినట్లు తెలిపారు , అలాగే ప్రస్తుతం 14 వేల 700 మంది రైతులకు 143.83 కోట్లు రుణ మాఫీ జరిగినట్లు తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వలన 300 మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని వీరికి కూడా త్వరలోనే రుణ మాఫీ జరిగేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు . బ్యాంకర్లు , వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రుణ మాఫీ మొత్తాన్ని తమ తమ ఖాతాలో జమ అయ్యేటట్లు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. 3వ విడుత రానున్న 10-15 రోజులల్లో రుణ మాఫీ కార్యక్రమం జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి మండల కేంద్రం లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు , ప్రతి బ్యాంక్ ముందు గ్రీవెన్స్ సెల్ ఫోన్ నెంబర్లను ప్రదర్శిస్తున్నాయని రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్లప్పుడూ రుణ మాఫీ కి సంబంధించిన అన్ని పనులు సకాలంలో చేస్తున్న అధికారులను అభినందిస్తూ , ఎక్కడ ఎలాంటి సాంకేతిక సమస్యలు తెలత్తకుండ ఎప్పటికప్పుడు సరైన సమాచారం తో అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు, అక్కడికి వచ్చిన రైతు రుణ మాఫీ లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ వారి ఊరు పేరు , వారికి అయిన రుణ మాఫీ మొత్తం, ఈ సారి వేసిన పంటల వివరాలు అడిగి తెలుసు కున్నారు.అనంతరం 5 మంది రైతులకు రుణ మాఫీ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కూడా ఛైర్మెన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతులకు రుణ మాఫీ జరగకపోతే మానవతా దృక్పథం తో తప్పులు సరి చేసి రైతులకు రుణ మాఫీ జరిగేటట్లు బ్యాంకర్లను కోరారు. వచ్చిన రుణ మాఫీ నీ వేరే పనులకు ఉపయోగిచకుండా వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించుకొని అబివృద్ధి చెందాలని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్,వ్యయసాయ అధికారి రవీందర్ సింగ్, డి.సి.ఓ నాగేశ్వర రావు, జిల్లాలో ఉన్న బ్యాంక్ మేనేజర్లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.