Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

క్రీడలతోటే మానసిక ఉల్లాసం -హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సారంగపాణి

.క్రీడలతోటే మానసిక ఉల్లాసం
-హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సారంగపాణి
(జై భారత్ వాయిస్ఆత్మకూరు రిపోర్టర్ అశొక్):
విద్యార్థులు, యువతి యువకులు క్రీడలపై ఆసక్తి చూపడం వల్ల మానసిక ఉల్లాసముతో అన్ని రంగాలలో రాణిస్తారని హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సారంగపాణి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు, యువతి యువకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని యువతలో దాగి ఉన్న క్రీడ నైపుణ్యాన్ని వెలికితీయడం కోసమే క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడల్లో రాణించేవారు మానసిక ఉల్లాసంతో చదువుల్లో కూడా రాణిస్తారు అని అన్నారు. క్రీడలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మండల కమిటీలను వేస్తుందన్నారు అందులో భాగంగానే ఆత్మకూరు మండలం కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులుగా బరుపట్ల కిరీటి, ప్రధాన కార్యదర్శిగా కీత అనిల్ కుమారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అజీజ్ ఖాన్, ఉపాధ్యక్షులు పసుల రమేష్, క్రీడాకారులు విజయ్,చందు,విజేందర్, కరుణాకర్, పవన్, రాజు, కాడబోయిన మొగిలి తదితరులు పాల్గొన్నారు

 

Related posts

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Sambasivarao

ఆత్మకూరు మండలం కేంద్రం లో ఫొటొటెక్  పొస్టర్ ను ఆవిష్కరించినమండల అధ్యక్షులు  వెలిదే లక్ష్మణ్

చౌల్ల పల్లికి ఆర్ టీ సీ బస్సు పునరుద్ధరణ

Sambasivarao