పేదల సంక్షేమానికి రాజీపడేది లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) :
పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం ఆత్మకూరు రైతు వేదికలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదరికంలో ఉండి అనారోగ్య పాలై ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి వారి కుటుంబాలకు భరోసా అందిస్తుందని తెలిపారు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ఆత్మకూరు దామెర మండలాల మండలంలో 66 మంది కి సీఎం రిలీఫ్ ఫండ్ 20 లక్షల 31 500 రూపాయలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ఏడు గురికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 7 లక్షల 812 రూపాయలను చెక్ లను అందజేశారు. పేదలకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లు నిలుస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పైన ఈనెల ఐదో తేదీ నుండి ఐదు రోజులపాటు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం మొక్కలు పెంచే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ మాజీ పిఎసిఎస్ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి, ఆత్మకూరు పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు ,మండల నాయకులుకక్కే ర్ల రాజు, మార్క రజనీకార్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు భయ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
previous post
next post