Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

పుట్టిన శిశువుకు ముర్రిపాలు పాటించాలి

జై భారత్ వాయిస్ దామెర
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఐసిడిఎస్ పరకాల ప్రాజెక్ట్ దామెర సెక్టార్ ఆధ్వర్యంలో దామెర అంగన్వాడి సెంటర్లో సెక్టార్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమానికి దామెర మండల స్పెషల్ ఆఫీసర్ బాల రాజు, జిల్లా పంచాయతీ అధికారి. షరిపోద్దిన్  ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి   పుట్టిన గంటలోపు ముర్రుపాలు. తాగించాలని  ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు అందించాలని అన్నారు.ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు బిడ్డకు అన్నప్రాసన చేసి అదనపు  పోషకాహారం మొదలుపెట్టి తినిపించాలని బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి సంపూర్ణ పోషకాలు కలిగిన అదనపు ఆహారాన్ని అందించాలని అందుకుగాను అంగన్వాడీ కేంద్రాల నుండి అందిస్తున్నటువంటి బాలామృతం పిల్లలకు తినిపించాలని కోరారు.  ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందిస్తున్న పోషకాహారాన్ని పోషణ ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో  ఆరు నెలలు పూర్తి చేసుకున్న పిల్లలకు అన్నప్రాసన చేయడం,  పిల్లల బరువులను పరిశీలన చేయడం  ఐసిడిఎస్ నుండి సరఫరా చేయబడుతున్న పోషకాహారాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామర సెక్టార్ సూపర్వైజర్  రాణి దామర గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి  పంచాయతీ సెక్రెటరీ నరేష్ సార్ గారు ఏఎన్ఎం ఉమారాణి  అంగన్వాడీ టీచర్లు వనజ కోమల ఆశా కార్యకర్తలు శైలజ తల్లులు హాజరయ్యారు

Related posts

Photo Exhibit Puts Talents, Emotion On Display

Jaibharath News

Go Wild For Western Fashion With These Pioneering Outfits

Jaibharath News

Apple MacBook Air Vs. Microsoft Surface Laptop

Jaibharath News