టీఎన్జీవోస్ కేంద్ర సంఘ కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య ఉపాధ్యక్షులు, టీఎన్జీవోన్ కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో మారం జగదీశ్వర్ ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు., ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు . ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ కార్యదర్శి గాజే వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహ అధ్యక్షులు,హేమనయక్,ఉపాధ్యక్షులు దుర్గారావు,వంశిధర్ బాబు, జిల్లా నాయకులు శ్రీనివాస్,చిరంజీవి, కుమారస్వామి,భరత్ తదితరులు పాల్గోన్నారు.