(జై భారత్ వాయిస్ హన్మకొండ) ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం అధ్వర్యంలో హనుమకొండ ఏకశిలా పార్కలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అభ్యుదయ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సిద్దోజు విద్యాసాగర్ పూల మాలలతో ఘనమైన నివాళులు అర్పించారు. ఎర్రోజు బిక్షపతి విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు , విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అభ్యుదయ సంఘం కార్యదర్శి కూరోజు దేవేందర్ , VOPAS నాయకులు వేల్పుల దేవా చారి, పొడిశెట్టి విష్ణువర్ధన్, పిన్నోజు సదానంద చారి, మట్టేవాడ బ్రహ్మచారి, పుప్పాల ఆంజనేయులు, శృంగారపు వెంకటేశ్వర్లు, రాగి కరుణాకర్, శ్రీపాద సుధాకర్ రావు, రుద్రోజు మహీంద్రా చారి, సూర్యప్రకాష్, చిలుపూరి శ్రీధర్, బి శ్రీనివాస్,తదితరులు వరుసగా జయశంకర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు కూడా అర్పించారు.తెలంగాణ సిద్ధాంతకర్త, స్ఫూర్తి ప్రదాత, తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంకితము చేసిన మహానుభావులు ఆచార్య జయశంకర్ సారు 90వ జయంతి సందర్భంగా తెలంగాణ జాతిపితగా వారి పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అభ్యుదయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సిద్దోజు విద్యాసాగర్ తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి సంయుక్తంగా డిమాండ్ చేశారు.ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా, నిరాడంబరముగా అభ్యుదయ భావాలతో నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ మానవాతావాధిగా పేరుగాంచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన మహా మేధావి, తన రచనల ద్వారా అనేక సభ వేదికలలో ఉపన్యాసాల ద్వారా నీళ్లు నిధులు నియామకాలు, వలసవాదుల దోపిడీకి గురైతెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలతో తెలియజేసి, యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలని, ప్రశ్నించే ధైర్యం సమాజానికి రావాలని ఆశించేవారు. ప్రత్యేక రాష్ట్ర సాకారం కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రకటించే అంతవరకు విశ్వబ్రాహ్మణులు ఐక్యంగాకృషి సల్పుతారని తెలిపారు
previous post