Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కే యూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు :

జై భారత్ వాయిస్ వరంగల్
2024-2025 విద్యాసంవత్సరానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయం వివిధ కొర్సులకు ప్రవేశాకునోటిఫికేషన్ జారీ చేసిందని గ్రేటర్ వరంగల్ నగరంలోని 16 వ డివిజన్ ధర్మారం లోని ఎస్. ఎస్. డిగ్రీ కళాశాల దూరవిద్య కేంద్రం కో ఆర్డినేటర్ కొక్కొండ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ లో బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ లో అడ్మిషన్ పొందటానికి ఇంటర్ పాస్ అయి ఉండాలన్నారు. , పిజిలో ఎంఎ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎచ్ ఆర్ ఎం, ఎంఎస్ డబ్ల్యూ,బిఎల్ ఐసి, ఎంఎల్ ఐసీ లో అడ్మిషన్ పొందటానికి డిగ్రీ పాస్ అయి ఉండాలని  శ్రీకాంత్ అన్నారు.అలాగే ఒక సంవత్సరములో పూర్తి చేసే డిప్లమా ఇన్  కంప్యూటర్ అప్లికేషన్, , గైడెన్స్ & కౌన్సులింగ్, కోర్స్ చేయటానికి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఆరు నెలలో పూర్తి చేసే సి ఎల్ ఐసీ కోర్స్ చేయటానికి ఇంటర్ పూర్తి చేసినవారు అర్హులు, మూడు నెలలో పూర్తి చేసే ఓరియెంటెయేషన్ ప్రోగ్రాం ఇన్ మిమిక్రీ,  కోర్సులో అడ్మిషన్ పొందటానికి పదవతరగతి పూర్తి చేసినవారు అర్హులు అన్నారు. ఆగష్టు 31 వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని,వివరాలకు 9963591463 నెంబర్ లో సంప్రదించగలరని శ్రీకాంత్ తెలిపారు.

Related posts

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కుమార్ గాడ్గేకి మద్దతు తెలిపిన టీబీసీపీఎస్ రాష్ట అధ్యక్షులు నాయిని భరత్