Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సాంకేతిక విద్యలో విద్యార్థులు ముందు ఉండాలి

సాంకేతిక విద్యలో ముందు ఉండాలి

విద్యార్థులు సాంకేతిక విద్య లో ముందు ఉండాలని ఎన్ఆర్ఐ ఎర్రబెల్లి శృతి అన్నారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ కాపులకనపర్తి పాఠశాలలోని కంప్యూటర్లను పరిశీలించారు. గతంలో ఎన్నారై అనిల్ రావు ఇచ్చిన కంప్యూటర్లు ఎలా పనిచేస్తున్నాయి, విద్యార్థిను ఏం నేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సీతాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేటి సాంకేతిక యుగంలో కంప్యూటర్ విద్యా అనేది తప్పనిసరి అని అన్నారు. అంతర్జాలంలో అవసరమైనటువంటి విషయాలను మాత్రమే నేర్చుకోవాలని సూచించారు . ఏది అవసరమో ఏది అనవసరమో విద్యార్థులు గుర్తించాలన్నారు. విద్యార్థులు లక్ష్యం ఏర్పరచుకొని చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి గోపాల్ రావు, ఉప సర్పంచ్, ఉపాధ్యాయులు రాజన్న, వెంకటేశ్వర్లు, స్వప్న కుమారి, రవీందర్, రతన్ సింగ్ రాథోడ్, అశోక్, తదితరులు ఉన్నారు.

Related posts

మనుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఫిబ్రవరి 1 నుంచి  15వ తేదీ వరకు  ఇంటర్మీడియట్ ప్రాక్టికల్

సంగెం ఎంపిపిపై అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారికి తీర్మాణం అందచేసిన ఎంపిటిసిలు..

Jaibharath News