Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎస్సారెస్పీ కెనాల్ మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్న అక్రమార్కులు???

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//నీలగిరి స్వామి తండా
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 13 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:-వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి స్వామి తండా వద్ద ఎస్సారెస్పీ కెనాల్ కాల్వకు భవిష్యత్తు అవసరాలకు నిల్వ ఉంచినటువంటి మొరాన్ని యదేచ్చగా తరలిస్తున్నారు అక్రమార్కులు….
గత కొన్ని రోజుల నుండి ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురిస్తున్న వివిధ పత్రికలు..స్పందించి ఈ అక్రమ మట్టి రవాణాను అడ్డుకట్ట వేయలేకపోతున్న వర్ధన్నపేట మైనింగ్ అధికారులు..
మున్సిపాలిటీ పరిధిలోని మట్టిని బహిరంగంగా ఎత్తుకొని పోతుంటే కనీసం స్పందించని స్థానిక అధికార, ప్రతిపక్ష నాయకులు ఏవో ఏవో డాక్యుమెంట్స్ చూపించి అనుమతి ఉందని చెప్తున్న మట్టి తరలింపుదారులు…ఒకవేళ నిజంగా మట్టి తరలింపుకు మైనింగ్ అధికారాలు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టీ ఎందుకు చెప్పడం లేదు పత్రికలు వరుస కథనాలు రాస్తున్నప్పుడు??? స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ అంశాన్ని పరిశీలించి, ఒకవేళ ఈ మట్టి తరలింపు నిజంగా అక్రమం ఐతే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కోరుతున్నాము.

Related posts

దేవాలయ ప్రధాన అర్చకులు ఆకాంక్ష డాక్టర్ మోహన్ కృష్ణ భార్గవలకు జరిగిన సీమంత మహోత్సవం

హెచ్ జీ లకు మహిళా శక్తి పథకం పై అవగాహన కల్పించండి: బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు లోనాలా రిటేనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలి