(జై భారత్ వాయిస్ ఆత్మకూరు) : మండలంలోని శ్రీ చెన్నకేశవ స్వామి (లక్ష్మి చార్ల ) ఆలయ సమీపంలో నీరుకుల్లా రహదారి పక్కన ఉన్న కోళ్ల ఫామ్ లను మూసివేయాలని నీరుకుల్ల’ కందిబండ, పెంచికలపేట, కేశపూర్ గ్రామాలకు ప్రజలు ముకుమ్మడిగా సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ పంట పొలాలకు చెన్నకేశవ స్వామి ఆలయానికి సమీపంలో కోళ్ల ఫామ్, లు కొనసాగుతూ ఉండడంతో కోళ్ల ఫామ్ లో నుండి వచ్చే దుర్వాసన ఇటు భక్తులను సమీప పంట పొలాల రైతులను రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు కోళ్ల ఫారం వ్యర్ధాలు, దుర్వాసన వల్ల ఈగలు దోమలు వృద్ధి చెంది పంట పొలాలను నాశనం చేయడమే గాక అక్కడ పనిచేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోయారు. చెన్నకేశవ స్వామి దర్శనానికి వస్తే భక్తులు స్వామివారిని దర్శించుకొని ఐదు నిమిషాలు ఉండలేని పరిస్థితి నేలా కొంటున్నదని వారు తెలియజేశారు. కోళ్ల ఫామ్ లో వ్యర్థాలను సమీపంలోని వాగుల్లో వదలడం మూలంగా వాగు నీరు కలుషితం అవుతుందని అన్నారు. అలాగే కోళ్ల ఫామ్ లో పనిచేసే సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం తప్ప తాగి రహదారి బాటసారులను మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తూన్నారని తెలిపారు. కోళ్ల ఫాములు మూసి వేసేదాకా ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతులు గౌడ కులస్తులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.