Jaibharathvoice.com | Telugu News App In Telangana
కరీంనగర్ జిల్లా

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 కరీంనగర్ జిల్లా ప్రతినిధి:-స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసు బలగాలు హాజరై కవాతు, గౌరవ వందనం, వివిధ పాఠశాలల విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ లక్ష్మీనారాయణ, అనూక్ జయ కుమార్. అడ్మిన్ ఆర్ ఐ రజనీకాంత్. ఎం టి ఓ కుమారస్వామి. సాట్ టీం ఆర్ఐ జానీ మియలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరీంనగర్ డిపోకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు

కరీంనగరులో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్షా సమావేశం

Sambasivarao

పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి