వరంగల్ జిల్లా//మొగిలిచర్ల గ్రామం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 14 వరంగల్ తూర్పు ప్రతినిధి:-వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, గ్రేటర్ వరంగల్ 15 వ డివిజన్ మొగిలిచర్ల లో బిజెపి డివిజన్ అధ్యక్షులు బిల్లా రమేష్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు డివిజన్లో జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు శివకుమార్, ఓ బి సి మోర్చ జిల్లా కార్యదర్శి ఆడేపు రమేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామకృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల ప్రభాకర్, డివిజన్ నాయకులు నరిశెట్టి చంద్రమౌళి, లెంకలపల్లి స్వామి, రమేష్, కార్యకర్తలు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.