వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//వంచనగిరి గ్రామం
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 15 వరంగల్ తూర్పు ప్రతినిధి:-
గీసుకొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రంపిస రాజేశ్వర్ రావు ఉదయం మరణించగా వారి మరణవార్త విన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వారి కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజేశ్వరరావు, కొండా మురళీధర్ రావు వంచనగిరి గ్రామానికి సర్పంచుగా చేసిన సమయంలో వీరు ఉపసర్పంచుగా పనిచేసినారు. ఈ కార్యక్రమంలో రడం భరత్, ముత్తినేని వేణుగోపాల్, కొండా వెంకన్నా, మాజీ సర్పంచులు అమిర్శెట్టి రాజు, బోనాల అశోక్, సారంగం, కొండా మధు, కరుణాకర్, శ్రీనివాస్, కొట్టగట్టు రాజు పాల్గోన్నారు.