భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:-
78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలల్లో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్. రాష్ట్ర, జిల్లా బిజెపి నాయకులతో కలిసి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం గీసుకొండ మండలంలోని ధర్మారంలో ఘనంగా జాతీయ పథాకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరు దేశభక్తితో ఆగస్టు 15 న మరియు జనవరి 26 న మాత్రమే కాకుండా 365 రోజులు ఆ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి, తాము దేశం పట్ల బాధ్యతతో ఉండాలని, క్రమశిక్షణ అలవర్చుకోవాలి అని, సమాజం పట్ల కొంత సేవ భావం మరియు బాధ్యత కల్గి ఉండాలని ఉన్నతమైన ఉత్తమ దేశ పౌరులు కావాలని కోరారు. దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకంటూ. ధనిక, పేద అంతరాల్లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రమాణం చేద్దాం. వికసిత భారత్ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరం భాగస్వాముల మవుదాం. జాతీయ పండుగల విశిష్టతను, స్వాతంత్ర్య సాధనలో ఆనాటి ఎంతో మంది వీరుల త్యాగాలు ఈనాటి మన దేశ స్వేచ్ఛ యొక్క మూల ధనము అని గుర్తు చేశారు. ప్రజలందరూ ఎంతో చిత్తశుద్ధితో జాతీయ గీతాళాపన చేసి మిఠాయిలు పంచుకొని పండగ చేసుకున్నారు.
previous post