Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుంది మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు


జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 వరంగల్ జిల్లా ప్రతినిధి:-మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోనే కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కొండా మురళీధర్ రావుని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తులు చేశారు. మురళీధర్ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంతవరకు సమస్యలను ఫోనులోనే పరిష్కరించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి కానీ మంత్రి దృష్టికి కాని తీసుక రావాలని ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మరోమారు ప్రజలకు స్పష్టం చేశారు.

Related posts

మలేరియా పై అవగాహన ర్యాలీ

ఆటో డ్రైవర్లు ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాలి వరంగల్‌ సిపి అంబర్‌ కిషోర్‌ ఝా

అక్రమంగా నాటు సార రవాణా చేస్తు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

Sambasivarao