జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 పరకాల డివిజన్ ప్రతినిధి:-
హన్మకొండ శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఘనంగా వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు.మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శ్రావణమాస పౌర్ణమి ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజున సకల సౌభాగ్యప్రదమైన వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పూజా కార్యక్రమం ఏర్పాట్లును చేసినారు అర్చకులు మొదట గణపతి పూజ తరువాత శ్రీ మహాలక్ష్మి దేవి అష్టోత్తరాలు పసుపు కుంకుమ పూలతో కలసారాధన చేసి వరలక్ష్మి పూజను వైభవంగా నిర్వహించినారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.