Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 16 హనుమకొండ ప్రతినిధి:-
హన్మకొండలోని ప్రభుత్వ జిల్లావిద్యా శిక్షణ సంస్థలో గెస్ట్ లెక్చరర్ అధ్యాపకుల దరఖాస్తుకు ఆహ్వానం. ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ హనుమకొండలో గత కొద్ది నెలలుగా అధ్యాపకుల కొరత ఉన్నదన్న విషయం తెలిసిందే అందుకు కళాశాల ప్రిన్సిపాల్ డి వాసంతి అతిథి అధ్యాపకుల గెస్ట్ లెక్చరర్ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం కోరుతుంది. అధ్యాపక పోస్టులకు అతిథి అధ్యాపకులుగా తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేయుటకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది విద్యార్హత వివిధ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేట్ & ఎంఈడి చేసినవారు అర్హులు. సబ్జెక్టు వారీగా ఖాళీలు ఫిలాసఫీ/సోషలజీ/సైకాలజీ ఉర్దూ మీడియం -1 ఉర్దూ లాంగ్వేజ్-1 సైన్స్ పెడగాజి ఉర్దూ మీడియం-1 సైన్స్ పెడగాజి తెలుగు/ఇంగ్లీష్ మీడియం-1 ఆసక్తి మరియు అర్హతగల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా పూర్తి పత్రాలతో 21-8-2024 తేదీలోగా డి వాసంతి కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ హనుమకొండలో సమర్పించగలరని కోరుతుంది.

Related posts

డాక్టరు కు కాకతీయ నంది అవార్డు

Jaibharath News

విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

పింగిళి కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం