రిపోర్టర్ జ్యోతి
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆదేశానుసారం సీజనల్ వ్యాధులపై జరిగిన జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వరాలతో వచ్చిన వారికి రాపిడ్ కిట్ ద్వారా డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లయితే దానిని నిర్ధారణ చేసుకోవడానికి ఎంజీఎం లేదా టి- డయాగ్నస్టిక్ హబ్ లలో ఎలీషా పరీక్షకు పంపించాలని అన్నారు.ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రులలో ఎలిసా పరీక్ష అందుబాటులో ఉన్నట్లయితే అక్కడే పరీక్షించి వివరాలను తెలియజేయాలన్నారు. పేషెంట్స్ డెంగ్యూ పాజిటివ్ అనగానే భయానికి లోను అవకుండా వారికి తగిన ధైర్యాన్ని కల్పించాలని అన్నారు.అన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షల చార్జీలు, బెడ్ చార్జీలు, మందుల ఖరీదు ఎంత అవుతుందనేది ఆసుపత్రులలో చేరే ముందే పేషెంట్స్ కు తెలియజేయాలని, అలాగే చట్ట ప్రకారం అన్ని చార్జీలు వివరాలను అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే వారిని ఆసుపత్రిలో చేర్చుకోవాలని, ఆసుపత్రిలో చేరటం భారంగా పరిగణించకూడదని అన్నారు.డెంగ్యూ,మలేరియా ఇతర వ్యాధుల వివరాలను ప్రతిరోజు నిర్ణీత ప్రొఫార్మాలో తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రైవేట్ ఆసుపత్రులకు ఉందన్నారు. పాజిటివ్ కేసుల వివరాలను అన్నింటిని పూర్తి చిరునామాతో తెలియజేస్తే పంచాయతీ,మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖ వారు ఆ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. ప్లేట్లెట్స్ మార్గదర్శకాల ప్రకారం పేషెంట్స్ కు అందించాలని అన్నారు.ఆసుపత్రులలో అందిస్తున్న సేవలు పై ఫిర్యాదులు అందినట్లయితే జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీం వాటిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో గుర్తింపు పొందిన చికిత్సల ను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని, ఇవి పూర్తిగా ఎలాంటి నగదు చెల్లింపులు లేనటువంటివని పేషంట్ల కు ఇబ్బంది కలిగించోద్దని, వారు డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఎలాంటి అదనపు చెల్లింపులు వసూలు చేయవద్దని ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు.ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ లలితాదేవి,అదనపు డిఎంహెచ్వో మదన్ మోహన్ రావు, ఐఎంఏ మరియు ప్రైవేటు ఆసుపత్రి నుండి డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ బింగి శ్రీనివాస్, పరకాల ఆస్పత్రి సూపరింటెండెంట్ గౌతమ్ చౌహన్ అధికారులు పాల్గొన్నారు.