Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ (మలేరియా & ఫైలేరియా) డాక్టర్ అమర్ సింగ్ గారు శనివారంనాడు వరంగల్ జిల్లాలోని ఎంజీఎం హాస్పిటల్ , రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేసినారు.ఎంజీఎం సూపరింటెండెంట్ ఛాంబర్ లో జరిగిన సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ సంబంధిత ఎంజీఎం హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సమన్వయం చేసుకుంటూ జిల్లాలోని డెంగ్యూ వ్యాధి ద్వారా ఎలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎంజీఎంలోని డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్సను వార్డులలో తిరిగి పర్యవేక్షించారు.ఎంజీఎం లోని బ్లడ్ బ్యాంకు లో రక్తనిధి నిలువలు ప్లేట్లెట్లను వ్యాధిగ్రస్తులకు సరిపోయే విధంగా అందించేందుకు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి వారి పరిధిలో గల డెంగ్యూ కేసుల వివరాలను తెలుసుకొని వ్యాధిగ్రస్తుల గృహాలను సందర్శించి వైద్యపరమైన సూచనలు చేశారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి వరంగల్ జిల్లాలో డెంగ్యూ మలేరియా వ్యాధి తీవ్రత గురించి తెలుసుకొని తగు సూచనలు చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో యాంటీ లార్వా దోమల నివారణ పిచికారి మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. అన్ని గ్రామాలలో డ్రై డే- ఫ్రైడే నిర్వహించాలని తెలిపారు.ఇంటింటి జ్వర సర్వే చేపట్టి జ్వరపీడుతులకు సత్వరం వైద్య సేవలు అందించాలని, వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపు లను నిర్వహించాలని అదేవిధంగా ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.క్షేత్రస్థాయి పర్యటన అనంతరం జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ని కలిసి జిల్లాలోని సీజనల్ వ్యాధుల పట్ల నివేదిక అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి, డిప్యూటీ డిఎం&హెచ్వో డాక్టర్ గోపాల్ రావు, జెడ్ఎమ్ఓ డాక్టర్ సునీల్, ఏడి నాగయ్య, పిఓ డాక్టర్ మోహన్ సింగ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వనజ, సబ్ యూనిట్ ఆఫీసర్లు మాడిశెట్టి శ్రీనివాస్, అజయ్, విజయేంద్ర కుమార్, యాదయ్య, నందా, సూపర్వైజర్లు సదానందం,రవీందర్, హెల్త్ అసిస్టెంట్లు కుమారస్వామి, చక్రపాణి, శ్యాంసుందర్, మత్యాస్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర స్థాయి బెస్ బల్ టోర్నమెంట్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

Sambasivarao

గంగదేవిపల్లి ప్రభుత్య పాఠశాలకు వాటర్ ప్లాంట్: బహుకరణ

Jaibharath News

ప్రతి వ్యక్తి మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి*