Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల.. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వరంగల్ తూర్పు ప్రతినిధి:-రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. రైతులను మోసం చేయడం కాంగ్రెసుకు కొత్త కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు, రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని ఒక ప్రకనలో తెలిపారు.రాష్ట్రంలో రుణమాఫీకి 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పింది. రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. రూ.31వేల కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించిందని.. రూ.26వేల కోట్లంటూ బడ్జెట్‌ ఆమోదించిందని.. చివరకు రూ.17వేల కోట్లతో రుణమాఫీ అన్నారన్నారు. కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి వంద శాతం చేశామని మరోసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 25 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టి మోసంచేశారని అన్నారు. కనీసం 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. ఒకవైపు రైతుబంధు రాక, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక పోవడంతో రైతులు అంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఏనాడు ఇబ్బందులకు గురికాలేదన్నారు.
గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరిస్తామని.. వివరాలను జిల్లా  కలెక్టర్లకు, రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని అన్నారు. రుణమాఫీ విషయంలో పూటకోమాట చెప్తూ కాలం గడిపిన రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వాలనే విషయం రైతులకు గుర్తులేకుండా చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు రైతుబంధు కింద ఇవ్వాల్సిన డబ్బులెన్ని, రుణమాఫి కింద ఇచ్చిన డబ్బులెన్ని అని రైతులు గమనించాలని కోరారు. మీటింగులలో దేవుల్లపైన ఒట్లు వేసి రేవంత్‌రెడ్డి ప్రజలను, రైతులను మోసం చేసి.. హిందు, ముస్లిం, క్రిస్టియన్లు నమ్ముకున్న దేవుళ్లకు కూడా ద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. రేవంత్‌ పాపం ప్రజలకు శాపం కావద్దని ఆ దేవుళ్లను వేడుకుంటున్నా.
పార్టీ ఆదేశాల మేరకు గ్రామ, మండల స్థాయి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ నెల 21 వ తేదీ నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రుణమాఫీ కానీ రైతుల వివరాలు పార్టీ ఇచ్చిన ప్రొఫార్మాలో సేకరించాలని కోరారు. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.ఇప్పటికైనా రైతులు గమనించి పార్టీలకు అతీతంగా రైతులంతా ఏకమయ్యి రేవంత్ రెడ్డి మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Related posts

చెక్ డాం తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

Sambasivarao

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

Jaibharath News

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ