జై భారత్ వాయిస్ ఆగష్టు 18 వర్ధన్నపేట డివిజన్ ప్రతినిధి:
హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా పోరాట యోధుడి చిత్రపటానికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య , గౌడ సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈజయంతి ఉత్సవాలలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.హ గౌడ కులస్తులతో నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది అలాగే జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లా నామకరణం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు వారి రక్షణ కోసం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తానని నానియోజకవర్గంలో పలుచోట్ల నా సొంత నిధులతో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టిచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను వ్యాసరచన పోటీల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో అధికారులు సర్దార్ పాపన్న గౌడ్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లపళ్లి రామస్వామి గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని యాదగిరి గౌడ్, గోప అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్, గట్టు రమేష్ గౌడ్, టిపిసిసి లీగల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కూనూరు రంజిత్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడుతో పాటు గౌడ సంఘ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.