జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
రాఖి పౌర్ణమి సందర్భంగా సోమవారం రోజున ప్రభుత్వ బాలికల సదననాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించారు.
ఈ సందర్భంగా బాలికలు కలెక్టర్ కు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా పిల్లలందరికీ నోటు పుస్తకాలు, బ్లాంకెట్స్, ఫ్రూట్స్ పంపిణీ చేసారు.అనంతరం సదనంలో విద్యార్థినీలకు అందిస్తున్న సేవలు, వసతి వివరాలు, ప్రస్తుతం ఆశ్రయం పొందుచున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెకెన్సి ఉద్యోగుల వివరాలు నివేదిక రూపంలో అందిస్తే ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారికి, సూపరింటెండెంట్ కు ఆదేశించారు.ఈకార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి బి, రాజమని, సూపరింటెండెంట్ ఎం కళ్యాణీ,జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, యూడిసి వి వెంకట్ రాం, సింధు రాణి, డివి ఆక్ట్ కౌన్సిలర్ పావని, ఎం మౌనిక, ఎ సతీష్ కుమార్, జి సునీత, నగేష్, చైతన్య, సీత, శ్రీలత, గౌతమి, త్రివేణి, తదితరులు పాల్గొన్నారు
next post