జై భారత్ వాయిస్ న్యూస్ 20 హన్మకొండ
కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలపై వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ నగర కమిషనర్ అశ్విని తానాజీ
వాకడే, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఉత్సవాలను చాలా సీరియస్ గా తీసుకొని ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమయాన్ని కేటాయించి నిర్వహించాలని అన్నారు. అందరూ ఒక టీం గా ఏర్పడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందని ఈ దర్గాకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని అన్నారు.మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల విజయవంతానికి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏమైనా శాశ్వత నిర్మాణాలు చేపట్టవలసి వస్తే వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా శానిటేషన్ మరియు ఇతర పనుల కొరకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని తెలిపారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ 25వ తేదీ కల్లా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హనుమకొండ ఆర్ డి ఓ, ఏసిపి, జిడబ్ల్యు ఎం సి అధికారులు కలిసి పరిశీలించి ఇంకేమైనా అదనపు వసతులు కల్పించాల్సి వస్తే మున్సిపల్ కమిషనర్ గారి కి తెలియజేయాలని అన్నారు. ఎన్పీడీసీఎల్ వారు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. జిడబ్ల్యూఎంసీ అధికారులు డ్రైనేజీ శుభ్రపరచడం ఎప్పటికప్పుడు చెత్తను తరలించేలా చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య పలను వెంటవెంటనే చేపడుతుండాలని, వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని అన్నారు. హైమాస్ లైట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ అధికారులు ఉరుసు ఉత్సవాలలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని, రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగినన్ని మందులతో 24 గంటలు వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్టీసీ ఉరుసు ఉత్సవాలు జరిగే ప్రాంతానికి రైల్వే స్టేషన్ ,వరంగల్ నుండి బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. రైల్వే క్రాసింగ్ వద్ద టెక్నికల్ సిబ్బందిని నియమించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు ఉర్స్ ఉత్సవాల ప్రాంతంలో సరియైన బారికేడ్ల ను ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక శాఖ వారు ఫైర్ ఇంజన్ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఉత్సవాలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, కాజీపేట రైల్వే స్టేషన్ మాస్టర్ తో సంప్రదించి రైళ్ల వేగాన్ని నియంత్రించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.ఈ సమావేశంలో కాజీపేట దర్గా షరీఫ్ కుశ్రు పాషా, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీం, మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీను, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post