Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

లిటిల్ ఫ్లవర్ స్కూలుపై చర్యలు తీసుకోవాలి

జై భారత్ వాయిస్ న్యూస్. పరకాల ఆగష్టు 20
విద్యా పేరుతో అధిక పీజులను వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.పరకాల పట్టణంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూలు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత మాట్లాడుతూ కనీసం ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని, ఇరుకు గదుల్లో రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించడం, పుస్తకాలు, మెటీరియల్స్ యూనిఫామ్ స్కూల్ లోనే అమ్మడం, ఈ పేర్లతో అదనంగా ఫీజులు వసూలు చేయడం, పాఠశాలకు కనీసం గ్రౌండ్ సౌకర్యం లేదని, గతంలో విద్యాశాఖ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, జనావాసంలో స్కూలు ఉండటం వల్ల అక్కడ నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు కనీస టాయిలెట్ సౌకర్యాలు లేవని, ఎన్నో ఆశలు కల్పించి అడ్మిషన్లు తీసుకుని మోసం చేస్తున్నారని, స్కూలు వ్యాన్లో విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్తున్నారని ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి లిటిల్ ఫ్లవర్ స్కూలుపై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దు, శివ, సాయి, మహేష్, హేమంత్, భరణి, వరుణ్, శివలు పాల్గొన్నారు.

Related posts

పేద రెడ్ల అభ్యున్నతికి కృషి’

Jaibharath News

ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్న కుడా చైర్మన్*

Sambasivarao

కుట్టు మిషన్లను పంపిణీ