(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు
సార్వత్రిక విద్యతో మధ్యలోనే విద్యను నిలిపివేసిన వారు సులభంగా ఉన్నత చదువులు చదివి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని సార్వత్రిక విద్య ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్రావు అన్నారు. మంగళవారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ హై స్కూల్లో ఓపెన్ స్కూల్ ప్రాధాన్యతపై అవగాహనలో భాగంగా ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,మహిళలు, వివిధ వృత్తి పనులు చేసుకునే వారు తమకి ఇష్టమైన సబ్జెక్టులను ఎంపిక చేసుకొని ఆదివారాలు సెలవు దినాలలో ముఖాముఖి తరగతుల కు హాజరై కోర్సు పూర్తి చేయవచ్చన్నారు. ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులు ఆత్మకూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కోఆర్డినేటర్ బొమ్మెర సోమయ్య సెల్ నెంబర్ 9394019001 సంప్రదించాలన్నారు. ఆన్లైన్ సంబంధింత రుసుము చెల్లించి ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. చివరి తేదీ సెప్టెంబర్ 10 ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేమారెడ్డి, సమత,శ్రీదేవి,రాజు,గ్రీష్మ, వసంత, రజిత,జూనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు