జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 20మానవ మలంను సేంద్రియ ఎరువగా మార్చి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కౌసల్య దేవి అన్నారు.గీసుకొండ మండలములోని జాతీయ ఆదర్శ గంగదేవిపల్లి గ్రామములోని ట్రైనింగ్ సెంటర్ లో జిల్లాలోని ఎంపిడిఓ, ఎంపీఓ, ఎపిఓ, ఎపియం,ఈసి, టి ఎ లకు, లీచ్ పిట్(రెండు గుంతల గౌరవ గృహం)నిర్మాణం తో మానవ మలం ఎరువుగా మారే విధానం పై మంగళవారం అవగాహణ కల్పించారు.ఈ సంధర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ రెండు గుంతల గౌరవ గృహం నిర్మించుకొని ఒక గుంత నిoడిన తరువాత మరో గుంతను వాడుకున్నట్లై తే మొదట వాడిన గుంతలోని మలం సేంద్రియ ఎరువుగా మారి,ఎటువంటి దుర్వాసన లేకుండా వుంటుందని,వ్యవసాయానికి వాడుకోవచ్చని అన్నారు.జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాoరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఒకే గుంత లోతుగా తీయటం వలన భూగర్భంలోని జలవనరులు కాలుష్యం అవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో సర్వే నిర్వహించి ప్రణాళిక బద్ధంగా అందరికీరెండు గుంతల గౌరవ గృహాన్ని నిర్మింప చేయాలన్నారు.స్వచ్ భారత్ జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని స్వచ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
గ్రామానికీ చెందిన చెంచు ఆదిరెడ్డి ఇంటి వద్ద గుంతలో నుoడి మలాన్ని తీసి ఎరువుగా మారిన విధానాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ అవగాహణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అంనoతరం ట్రైనింగ్ సెంటర్ లో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమములో ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌలి, డియల్పిఓ లు వేదవతి,రాజీవ్ కుమార్, ఎంపిడిఓ లు కమలాకర్,శ్రీ వాణీ, ఎంపీఓ లు ప్రభాకర్,ప్రకాష్,సునిల్ కుమార్ రాజు,శ్రీధర్,ధనలక్ష్మి,శ్రీనివాస్ లు, ఎపిఓ చంద్రకాంత్,ఫాతిమా మేరి,సునీత, ఎపియం సురేష్ కుమార్,ఈశ్వర్, ఈసి లు శ్రీలత,రాజు,టి లు సుధాకర్,సురేష్,సుష్మా,పంచాయితి కార్యదర్శులు సునీత,తదితరులు పాల్గొన్నారు.
next post