Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ 21 ఆగస్టు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆకాంక్షించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరి మోడల్‌ స్కూల్‌ జూనియర్ కళాశాలను,మోడల్‌ స్కూల్‌ వసతి గృహాన్ని కలెక్టర్‌ సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనంపై ఆరా తీశారు. ఇంటర్ మీడియట్ తరగతులను కలెక్టర్ సందర్శించి ఆర్థిక, భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య తో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ఫిర్యాదుల పెట్టె సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ హిమబిందు,కెర్ టేకర్ అరుణ, నాయబ్ తహశీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిరుపేద వ్యక్తి దహన సంస్కారాలకి ప్రజలను చైతన్యపరిచి దయాగుణం చాటుకున్న పోలీస్ అధికారి

Sambasivarao

అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

యోగా పోటీల అబ్జర్వర్ గా కమలాకర్

Jaibharath News