జై భారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ టౌన్
ఆగష్టు 21 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్రింద(ఎస్ డి ఎఫ్) హనుమకొండ నగరంలోని 4వ డివిజన్ జ్యోతి బసు నగర్ లో రూ.10 లక్షలు మరియు 60 డివిజన్ వడ్డేపల్లి, టీచర్స్ కాలనిలో రూ. 35 లక్షలతో అంతర్గత రోడ్ల (సీసీ) నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో నియోజకవర్గన్ని అగ్రగామిగా ఉంచుతానని తెలిపారు ఈ పర్యటనలో 4వ డివిజన్ పరిధిలోని లోటస్ కాలనీలో <span;>స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాలనీ వాసులతో . కలిసి విసతృతంగా పర్యటించారు. ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజ్, నాలాలపై పేరుకుపోయిన పిచ్చి మొక్కలను త్వరగతన తీసేయాలని ఆదేశించారు. లోటస్ కాలానికి రోడ్ల నిర్మాణం కొరకు సంబంధిత అధికారులు నివేదికలు అందించాలని తెలిపారు. లోటస్ కాలనిలో ప్రతియేట వర్షాలతో నీట మునిగే ప్రాంతాలకు పరిష్కార మార్గాలను చూపుతానని నేరుగా కాలనీ వాసులకు వివరించారు. సంబంధిత శాఖల అధికారులు వార్డులో పర్యటించి సమస్యలను నివృత్తం చేసే పనిలో ఉంటారని తెలియజేశారు. ప్రత్యేక ప్రణాళికతో “గ్యాంగ్ వర్క్” ని ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా రోజుకు ఒకటి లేదా రెండు వార్డులలో/కాలనీలలో మున్సిపాలిటీ, ఇతర శాఖల సిబ్బంది దాదాపు 20 మంది పనులు చేస్తారని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలకి వచ్చే ఏడాది నాటికి ఎలాంటి అవంతరాలు లేకుండా, ఖాబ్జాలకు గురైన ప్రాంతాలను తిరిగి యథాస్థానంలో ఉండేలా పనులు చేపడుతామని గుర్తుచేశారు. వడ్డేపల్లి, టీచర్స్ కాలనిలో స్థానిక ప్రజల అభిష్ట మేరకు మరో 20లక్షల నిధులు కేటాయిస్తానని ప్రస్తుత పనులను వేగవంతం చేయాలనీ కోరారు. వడ్డేపల్లిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట 4వ డివిజనులో మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబేద్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ బోడ డిన్న, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ నాయకులు వీరగంటి రవీందర్, నాలబోల సతీష్, బిన్ని లక్ష్మణ్, చీకటి ఆనంద్, 60వ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ నాగరాజు, డివిజన్ ఏనుకొంటి పున్నం చందర్, యుగేందర్, నవీన్, కమల్, అక్మల్, సాదిక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.