Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కమిషనరేట్ పరిధి నుంచి సమిష్ఠిగా గంజాయిని తరిమికొడుదాం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

కమిషనరేట్ పరిధి నుంచి సమిష్ఠిగా గంజాయిని తరిమికొడుదాం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా
హన్మకొండ
జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 22 హనుమకొండ ప్రతినిధి:-
ప్రజలు, పోలీసులు సమిష్ఠిగా కల్సి వరంగల్ కమిషనరేట్ నుండి గంజాయి మహమ్మారీని తరిమికొడుదామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణతో పాటు గంజాయి విక్రయదారులు, వినియోగ దారులను ఉక్కుపాదంతో అణివేయాలనే లక్ష్యంతో నూతనంగా 20 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందితో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం పనితీరుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ఓ పత్రికా ప్రకటన చేస్తూ దేశ భవిష్యత్తుయిన యువతను గంజాయి మత్తుకు బానిసలుగా మారుస్తూ, వారి కుటుంబాలను సమస్యల వలయంలోకి నెట్టివేయడంతో పాటు విధ్యార్థిని విధ్యార్థులు సైతం ఈ గంజాయి ఉచ్చుకు చిక్కికొని వారి భవిష్యత్తు అంధకారం చేసుకోవడంతో పాటు, వారి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు గంజాయి లాంటి మత్తు పదార్థాల ద్వారా చిద్రమవుతున్నాయి. నేటి సమాజంలో ప్రమాదకారిగా మారిన గంజాయి వంటి మత్తు పదార్థాలను కట్టిడి చేయాలనే లక్ష్యంతో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రిజర్వ్‌ ఇన్స్‌స్పెక్టర్‌, మరికొద్ది రిజర్వ్‌ సబ్‌`ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీస్‌ సిబ్బందితో నూతనంగా డ్రగ్స్‌ కంట్రోల్‌ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగం ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఈ ప్రత్యేక టీం ద్వారా సత్ఫలితాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఈ విభాగం ప్రారంభంలో ఇచ్చిన 8712584473 ఫోన్‌ నంబర్‌ ద్వారా ప్రజలు స్వచ్చందంగా ముందుగా వచ్చి చిన్న మొత్తంలో గంజాయిని విక్రయిస్తున్న విక్రయదారులతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయిని సేవించే వారి వివరాలు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా గంజాయి కంట్రోల్‌ టీం అధ్వర్యంలో గంజాయి విక్రయదారులు, వినియోగ దారులను అణిచివేసే ధోరణి ప్రారంభమయినది. ఈ విధంగా ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఈ ముప్పై రోజుల్లో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహలు, కొచింగ్‌ సెంటర్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఈ ప్రత్యేక విభాగం నిఘా పెట్టింది. దీనితో చిన్న, చిన్న మొత్తాల్లో గంజాయిని ప్యాకేట్లుగా మార్చి యువతతో పాటు, చదువుకున్న విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొంత వ్యక్తులు పక్క రాష్ట్రా నుండి గంజాయిని వివిధ మార్గాల్లో రహస్యంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళతో పాటు, గంజాయి సేవిస్తున్న వారిని సైతం పట్టుబడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేసి 33 మంది గంజాయి విక్రయదారులను అరెస్టు చేయడం జరిగింది. వీరి నుండి పోలీసులు సుమారు మూడు లక్షల విలువగల 11 కిలోల గంజాయి, ఆరు ద్విచక్ర వాహనాలు, 44 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, రెండు ల్యాప్ ట్యాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో 68 మంది గంజాయి సేవిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి వారిని కౌన్సిలింగ్‌ ఇచ్చి వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించబడ్డారు.
యువత భవిష్యత్తును నాశనం చేసి వారిని మత్తుకు బానిసలు మార్చేందుకు ఇకనైనా ఎవరైన గంజాయి విక్రయాలకు పాల్పడితే వారిపై మరింత కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని. అలాగే గంజాయి సేవించే వారిపై చర్యలు తప్పవని, ఎవరైన గంజాయి విక్రయాలు, సేవిస్తున్న సమాచారం వుంటే తక్షణమే 8712584473 నంబర్‌కు సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా వుంచబడుతాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

Related posts

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన అల్లం బాలకిషన్ రెడ్డి

Sambasivarao

అల్లం స్వప్న దేవి బాలకిషోర్ రెడ్డి మహా అన్నప్రసాదా కార్యక్రమం

Sambasivarao

ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి  బీజేపీ లో భారీగా చేరికలు