Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

-ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి 

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

 కన్నతల్లి పేరుతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు నిర్మల కుమారి, మొక్కలు నాటారు. విద్యార్థులందరూ మీ తల్లి పై ఉన్న ప్రేమతో మొక్కలు నాటిన వారందరూ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. అప్పుడే మీ అమ్మ మీదున్న నిజమైన ప్రేమకు ప్రతిరూపమే మొక్క అని అన్నారు. మీరు నాటిన మొక్కను సంరక్షించుకుంటే మీ కన్న తల్లులు ఎంతో సంతోషిస్తారు అన్నారు. అలాగే ఆత్మకూర్ మండలంలోని 16 గ్రామపంచాయతీలో 810 మొక్కలు, 700 మంది విద్యార్థులతో కలిసి నాటామన్నారు. వాటిని సంరక్షించుకునే పూర్తి బాధ్యత విద్యార్థులు ఉపాధ్యాయుల పైన ఉందన్నారు. పాఠశాలలను పరిశీలించేందుకు వచ్చి సమయంలో మీ మొక్కలు ఏపు గా పెరిగి ఉంటే అమ్మ మీద మీ ప్రేమ ఉన్నట్లు అన్నారు. తల్లిదండ్రులపై నిజమైన ప్రేమ ఉన్న విద్యార్థులు మొక్కలను రక్షించి అమ్మ పేరుగా పాఠశాలలకు బహుకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రవి, శ్వేత, సృజన, క్రాంతి, జితేందర్రెడ్డి, ఈసీ రాము, టి ఏ లు శ్రీధర్ సురేష్, సుధాకర్, మహిళలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని

స్వచ్ఛందంగా బందు పాటిస్తున్న ఆర్.ఎం.పి. పిఎం.పి డాక్టర్లు

Sambasivarao