ఘనంగా హేరంబ సంకష్ట హర చతుర్ధి మాసోత్సవం
జై భారత్ వాయిస్ న్యూస్ కాకినాడ ఆగస్టు 22
హేరంబ సంకష్ట హర చతుర్ధి సందర్భంగా కాకినాడ లోని భోగిగణపతి పీఠం ఆధ్వర్యాన గురువారం ఉదయం సుప్రభాత వేళలో చతుర్ధి ఉపవాసకులు నగర సంకీర్తన నిర్వహించారు.నాలుగు అడుగుల మూషికవాహన గణపతి విగ్రహాన్ని సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ జయ జయ గణేశ సంకీర్తన చేస్తూ పూలాభి షేకంతో ఊరేగించారు. బత్తాయి పండ్లతో పాల వెల్లిని ప్రత్యేకంగా అలంకరించి కలశ స్థాపన సహస్రనామ పారాయణ అఖండ హారతి అందించారు. అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు రు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్ల పూడి రమణరాజు మాట్లాడుతూ పీఠంలో సెప్టెంబర్ 7నుండి జరిగే 41వ నవరాత్రి ఉత్సవా ల్లో అష్టగణపతుల ఊరేగింపు వేడుక జరుగు తుందని తెలియజేశారు.