Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ప్రతిపక్ష నాయకులారా సిగ్గుపడండి ఏ మొహం పెట్టుకుని రోడ్లపైకి వస్తారు

జై భారత్ వాయిస్ న్యూస్ తూర్పు ప్రతినిధి:-ఆగష్టు 23 వరంగల్
రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసి లక్షలాది మంది రైతులకు రుణవిముక్తి చేసింది, రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్ట్ నెలలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనీ. ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, రెండు లక్షల రుణభారంతీరి, నిజమైన స్వేచ్ఛను పొందారని. శ్రీనివాస్ పేర్కొన్నారు. రుణవిముక్తి పొందిన లక్షల మంది రైతులు తమ ఇళ్లలో పండుగ చేసుకుంటుంటే మరోవైపు బీఆర్ఎస్ నాయకుల కళ్ళు మండుతున్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతుల పక్షాన మాట్లాడం విడ్డూరంగా ఉంది. అతను ఎప్పుడు కూడా తన సంపాదన గురించి చూసుకున్నారు తప్ప రైతుల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఎక్కడ మొరం దోచుకుందామా భూకబ్జాలు చేద్దామా ఆలోచనలో ఉన్నాడు తప్ప అభివృద్ధిపై అతను చేసింది శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు రాష్ట్రంలో అమలు చేశాం ఇక రుణమాఫీ కొన్ని తప్పులు జరగొచ్చు దాన్ని సరిదిద్దుకొని ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. కొన్ని కొన్ని తప్పులు జరగొచ్చు దాన్ని మేము సరిదిద్ధి రైతులకు న్యాయం చేస్తాం. సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ కానీ కొద్ది మంది రైతుల విషయంలో వాస్తవాలను వక్రీకరించి బిఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతుండడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు ఆ పార్టీ నాయకులకు కడుపు మంటగా ఉందని అన్నారు. అయితే రాజకీయ లబ్ధికోసం బీఆర్ఎస్ నాయకులు రైతులకోసం ముసలికన్నీరు కార్చుతున్నారని రోడ్లపైకి వచ్చి ధర్నా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలని విమర్శించారు. గత పదేళ్లు రైతులకు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసి ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వేస్తుంటే రాజకీయంగా జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను నిలువునా ముంచారని పేర్కొన్నారు. లక్షలాది మంది రైతులకు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద రాష్ట్రంలో వారి ఖాతాల్లో జమచేస్తే బీఆర్ఎస్ కు కన్ను కుడుతుందని అన్నారు. అసలు ఏమొహం పెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు ధర్నాకు సిద్ధమవుతున్నారో రైతాంగానికి చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక కళ్ళు మండుతున్న బీఆర్ఎస్ పార్టీ వైనాన్ని ప్రజలు చూస్తున్నారని తప్పకుండా రైతులే తగిన సమాధానం చెబుతారని గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.

Related posts

42వ డివిజన్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.

13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి

వరంగల్ ఎంజిఎం జంక్షన్ తుపాకీ కలకలం..!!!