జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు ప్రతినిధి:- ఆగష్టు 23వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షనులో గన్నును పారేసుకున్నాడు ఓ సి ఆర్ పి ఎఫ్ కానిస్టేబుల్. ఈ సంఘటన శుక్ర వారం ఉదయం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డుపైన గన్ను పడిపోయినట్టు తెలుస్తుంది. ఆ గన్నును గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆ తుపాకీని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనరుకు అందించాడు వరంగల్ మహా నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. ఇక తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.