Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

31 వరకు, అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు!

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు, బి ఎల్ ఐ సి పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు 31 వ తేదీ చివరి తేదీని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వరంగల్ ప్రాంతీయ అధ్యయన కేంద్రం పర్యవేక్షించిన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దూర ప్రాంత విద్యార్థులు ఉద్యోగస్తులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఉపయోగించుకోవాలని తక్కువ ఫీజుతో డిగ్రీ పీజీ కోర్సులను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో వరంగల్ ప్రాంతీయ సంచాలకులు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. సుంకరి జ్యోతి మాట్లాడుతూ ఓపెన్ యూనివర్సిటీ ని అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అంబేద్కర్ వర్సిటీ తెలుగు విభాగం అధిపతి డాక్టర్ రజని మాట్లాడుతూ అంబేద్కర్ వర్సిటీలో నాణ్యమైన విద్య, స్టడీ మెటీరియల్ సకాలంలో అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా పైన పేర్కొన్న కోర్సుల్లో తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను వెల్లడించారు. www.braouonline.in; www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు ఆమె తెలిపారు .
అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగష్టు 31వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680290/291/294/295 టోల్‌ఫ్రీ నెం.18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు.డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు, 2015-16 విద్యాసంవత్సరం నుండి 2023-24 వరకు అడ్మిషన్ పొందిఉంటే నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా టీఎస్ ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు అని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదిఆగష్టు 31 అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లా రమేష్, కళాశాల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య

ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించిన PRTU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి

Jaibharath News

ఒగ్లాపూర్ లో పోచమ్మ బోనాల పండుగ

Jaibharath News