జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగష్టు 23
వర్షాకాలం నేపథ్యంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతతో ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఆశ కార్యకర్తలు సమాచారాo సేకరించి అధికారులకు తెలియజేయాలని వరంగల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాంరెడ్డి అన్నారు.మండలంలోని మనుగొండ గ్రామములో చేపట్టిన డ్రై డే కార్యక్రమాలను, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామం,గ్రామములో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో భాగంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల గ్రామస్థులకు అవగాహణ కల్పించాలన్నారు.నీటి నిల్వ ప్రదేశాలను గుర్తించి వాటిని పూడ్చాలన్నారు. సైడ్ డ్రెన్ లో నీరు నిలిస్తే అయిల్ బాల్స్ వేయాలన్నారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనీ, గ్రామమల్లో బ్లీచింగ్ చల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపిడిఓ కమలాకర్, ఎంపీఓ అడేపు ప్రభాకర్, ఎపిఓ చంద్ర కాంత్,పంచాయతి కార్యదర్శి షకీల్ అహ్మద్, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయితీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.